నేడు వీధినబడి! | - | Sakshi
Sakshi News home page

నేడు వీధినబడి!

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

నేడు వీధినబడి! నాడు పోటీబడి..

నేడు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీపడ్డాయి. ‘మన బడి నాడు–నేడు’ బడుల్లో వైఎస్‌ జగన్‌ సకల వసతులూ సమకూర్చడంతోపాటు విద్యా ప్రమాణాల పెంపునకు విశేష కృషి చేశారు. అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తో పాటు కార్పొరేట్‌ స్కూళ్ల తరహాలో బోధన ఉండేలా చూశారు. ఫలితంగా నాడు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టేవారు. దీంతో కొన్ని పాఠశాలల వద్ద ‘సీట్లు లేవు’ అనే బోర్డులూ కనిపించేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి తిరగబడింది. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనను బాబు సర్కారు గాలికొదిలేసింది. విద్యాపథకాలకూ మంగళం పాడింది. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ బడుల్లో చేర్పించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపాధ్యాయులు వీధిన పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ స్కూల్లో పిల్లలను చేర్చాలని ప్రాథేయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

Advertisement
 
Advertisement
Advertisement