ఆముదాలపల్లిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆముదాలపల్లిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

ఆముదాలపల్లిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌ శ్రీమన్నారాయణుడికి ప్రత్యేక పూజలు

గన్నవరం: ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం జరిగింది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు పాటించాల్సిన స్వీయ సంరక్షణ పద్ధతులు, తోటివారిని కాపాడటంపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం మాక్‌డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పించింది. ప్రథమ చికిత్స, సీపీఆర్‌ చేసే విధానం, అగ్ని ప్రమాదాలు, తుపానులు, పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ కమాండర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ నేతృత్వంలోని రెస్క్యూ బృంద సభ్యులు కె.వెంకటేశ్వర్లు, జి.వెంకట్‌ నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్దనరావు, తహసీల్దారు జాలాది విమలకుమారి, అగ్నిమాపక అధికారి ఎన్‌.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఓఆర్‌ఆర్‌ను 70 మీటర్లకే పరిమితం చేయాలి

కృష్ణలంక (విజయవాడ తూర్పు): అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పేరిట రైతు లకు సీఎం చంద్రబాబు నష్టం కలిగిస్తున్నారని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీ నర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఓఆర్‌ఆర్‌ను 240 మీటర్ల వెడల్పున నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించి, 70 మీటరకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. చాలా మహా నగరాలకే రింగ్‌రోడ్లు లేవని, ఇప్పుడిప్పుడే ప్రారంభమైన అమరావతికి 189 కిలోమీటర్లు రింగ్‌రోడ్డు అవసరమా అని చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభలు నిర్వహించకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, హై కోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తే రైతులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర అధ్య క్షుడు కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సభలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, సీనియర్‌ నాయకుడు వై.కేశవరావు, కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకష్ణ, రైతు సంఘం గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కార్యదర్శులు, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.

కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన మండలంలోని ఉల్లిపాలెంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని పోలీసు అధికారులు మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామికి అవనిగడ్డ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్‌ పూజలు చేశారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజ జీయర్‌ స్వామిజీ ఆయనను దుశ్శాలువాలతో సత్కరించారు. ఆయన వెంట సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ చాణిక్య ఉన్నారు.

తైక్వాండో జట్ల ఎంపిక

వీరులపాడు: మండలంలోని పొన్నవరం శివారులో ఉన్న అంతర్జాతీయ ఏకత్వ పాఠశాలలో కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జట్ల ఎంపికలు జరి గాయి. ఎంపికై న క్రీడాకారులు తిరుపతిలో జరిగే ఐదో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు బస్సే నాగప్రసాద్‌ తెలిపారు. ఈ ఎంపికలకు ఏకత్వా పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మనోజ్‌ అమరనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్‌ దండు రత్నకాంత్‌, ఏకత్వ పాఠశాల వ్యాయామ విద్యా విభాగధిపతి విజయ్‌ కుమార్‌ గోగులమూడి, పీఈటీ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement