గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఓర్పుతో విని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఏ ఒక్క అర్జీని నిర్లక్ష్యం చేయకుండా, నిర్దిష్ట గడువులో పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదే విధంగా అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యం, లేదా అసంతృప్తికర స్పందనకు తావులేకుండా పనిచేయాలని హెచ్చరించారు. జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 26, పోలీసు శాఖకు 20, పంచాయతీరాజ్‌కు 15, రెవెన్యూకు 17 అర్జీలు ఉన్నాయి.
వచ్చిన అర్జీల్లో కొన్ని..


