మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి దాత గోసాలకు చెందిన ఎం. శ్రీనివాసరావు, పార్వ తీ దంపతులు సోమవారం రూ. 1,00,008 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
ఉచిత ప్రసాద వితరణకు విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
దుర్గమ్మ నిత్యాన్నదానానికి..
హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన కొండూరి సమన్విత కుటుంబం దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి అమ్మవారి నిత్యాన్న దానానికి రూ. 1,01,116ల విరాళాన్ని అందజేసింది. వీరిని కూడా అధికారులు ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.


