వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షురాలు పి. భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి స్పాట్ జరుగుతున్న కేబీఎన్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల నుంచి సంతకాల సేకరణ చేశారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి ఎన్. లోకేశ్ దృష్టికి తీసుకువెళడం కోసం ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు పి. లీల జిల్లా స్థాయిలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లను వివరించారు. మహిళా నేతలు ఎం. లలితశ్రీ, డి. విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఏసీబీ ఎస్పీ ఏ. సురేష్‌బాబు దంపతులు, కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం విడివిడిగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతనం ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ కె. ఈశ్వరావు, ఎస్‌ఐ పి. గౌతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
కోడూరు: భూమిలో పండే దుంపలు మూడు నుంచి నాలుగు కిలోల బరువు ఉంటా యి. సేంద్రియ పద్ధతుల్లో పండించిన దుంపలు ఆరు కిలోల వరకు కూడా ఉంటా యి. కానీ కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామానికి చెందిన కాలారి శ్రీమన్నారాయణ ఇంటి పెరట్లోని పెండలం దుంప ఏకంగా 12 కిలోల బరువు ఉండి అందరినీ అబ్బురపరుస్తోంది. ఏవిధమైన రసాయన ఎరువులు వినియోగించకుండానే దుంప పెరిగిందని శ్రీ మన్నారాయణ తెలిపారు.


