గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలి

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

● జరబాల లచ్చీరామ్‌ అనే మహిళ తనకు ఇంటి స్థలం కేటాయించాలంటూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఆమె సమస్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ● ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వాచ్‌మెన్‌లు, శానిటరీ వర్కర్లకు నెలకు కనీసం రూ. 10వేలకు తగ్గకుండా వేతనం ఇవ్వాలని ఆయా, వాచ్‌మెన్‌, శానిటరీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) నందు ప్రజల నుంచి వచ్చే అర్జీలకు గడువు తేదీలోగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. జేసీ ఎస్‌. ఇలక్కియ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పెండింగ్‌ అర్జీలపై అధికారులు క్రమం తప్పకుండా ఫాలో అప్‌ చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పీజీఆర్‌ఎస్‌కు 97 అర్జీలు..

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 97 అర్జీలు అందాయని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17, పోలీసు శాఖకు 14, రెవెన్యూ శాఖకు 11, వైద్య ఆరోగ్యానికి 8 అర్జీలు వచ్చాయన్నారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు, విద్య, పంచాయతీరాజ్‌ శాఖలకు 5 చొప్పున అర్జీలు వచ్చినట్లు వివరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, ఇరిగేషన్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, ఆర్‌అండ్‌బీ, భవనాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యకు రెండు చొప్పున అర్జీలు రాగా విద్యుత్‌, జెడ్పీ సీఈవో, పౌర సరఫరాలు, ఎండోమెంట్‌, మత్స్య, అడవులు, కార్మిక, మార్కెటింగ్‌, కాలుష్య నియంత్రణ, ఆర్‌ఐవో, గ్రామీణ నీటి సరఫరా, ఎస్సీ కార్పొరేషన్‌, సాంఘిక సంక్షేమ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు వివరించారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement