విజయవాడ కల్చరల్: శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో నెలవారీ సంగీత మహోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన యువ సంకీర్తనా గానం శాసీ్త్రయ సంగీత వైభవాన్ని చాటింది. యువ సంగీత విద్వాంసులు ఎస్.హిరణ్మయి వీణపై సద్గురువులు ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి రచించిన సంకీర్తనలను హృద్యంగా పలికించారు. కార్తికేయ ఆదినారాయణ వాద్య సహకారం అందించారు. విశాఖపట్నానికి చెందిన తిరువీధుల సుజాతాదేవి నిర్వహించిన గాత్ర సంగీత కచేరి అలరించింది. హనుమంత్ రామ్‌చరణ్ వయోలిన్‌పై, కార్తికేయ ఆదినారాయణ మృదంగంపై వాద్యసహకారం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత విద్వాంసుడు మోదుమూడి సుధాకర్ మాట్లాడుతూ.. యువ సంగీత విద్వాంసులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంగీత సమితి కార్యదర్శి సి.వి.రావ్ మాట్లాడుతూ.. సంస్థ ప్రతి నెలా యువ సంగీత కళాకారులను ప్రోత్సహించడానికి సంగీత వేదికలను కల్పిస్తోందన్నారు.


