2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలో ఒక్క కొత్త ప్రైవేట్ పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. కొత్తగా ప్రారంభమవుతున్నట్లు ప్రచారం చేస్తున్న ఏ విద్యాసంస్థకూ అధికారిక అనుమతులు లేవు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చిన విద్యాసంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ప్రచార హోర్డింగులు, బోర్డులు వెంటనే తొలగించాలని స్పష్టంగా పేర్కొన్నాం. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అడ్మిషన్లు చేసేటప్పుడు సంబంధిత పాఠశాలల అనుమతుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
– యూవీ సుబ్బారావు,
విద్యాశాఖాధికారి, కృష్ణా జిల్లా


