నూతన కార్యవర్గం ఎన్నిక మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. మొగల్రాజపురంలోని హోటల్‌లో ఆదివారం సబ్కా ఉమ్మడి కృష్ణాజిల్లా కమిటీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సబ్కా ఉమ్మడి కృష్ణాజిల్లా కమిటీ అధ్యక్షుడిగా మండవ సాయి, గౌరవాధ్యక్షుడిగా కలిదిండి కృష్ణం రాజు, ఉపాధ్యక్షులుగా కె.భూపతిరెడ్డి, కె. అమర్ బాబు, సెక్రటరీగా ఎల్.రవికిరణ్, కోశాధికారిగా వెంకటేశ్వరరాజు తదితరులను ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న మండవ సాయి మాట్లాడుతూ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించే దిశగా తమ అసోసియేషన్ నిరంతరం పనిచేస్తుందని నూతన కమిటీలోని సభ్యులు చెప్పారు. సుబ్బారాయుడికి
రూ. 9.57లక్షల ఆదాయం ఉత్సాహంగా
‘చతురంగ’ పోటీలు దుర్గమ్మకు పలువురి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విశాఖపట్నం పీఎం పాలెంకు చెందిన కేవీఎస్ శ్రీధర్, శాంత దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ విజయనగర్ కాలనీకి చెందిన వి. సూర్యనారాయణ పేరిట కుటుంబ సభ్యులు ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.4,64,890, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,51,980, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.1,10,395, శాశ్వత అన్నదానం ద్వారా రూ.1,24,368, స్వామివారి కల్యాణ కట్ట ద్వారా రూ.24,080, స్వామివారి దర్శన టికెట్ల ద్వారా రూ.45,800 తదితరాలు కలిపి మొత్తం రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు వివరించారు.
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు క్రీడారంగంలో సైతం ప్రావీణ్యం పెంపొందించుకోవాలని లయోల ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఫాదర్ జోజిరెడ్డి అన్నారు. కళాశాల ఆవరణలో ఆదివారం చతురంగ–2026 పేరుతో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. యూత్ ఎంపవరింగ్ సర్వీస్, చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన 148 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఎదుగుదల, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. నగరానికి చెందిన 3 ఏళ్ల 11 నెలల చిన్నారి ఇవాన్ ఈ పోటీలలో పాల్గొని, గెలిచి అందరినీ ఆకట్టుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టోర్నమెంట్‌లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్, ఫాదర్ బాల బొల్లినేని, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పార్కర్ తదితరులు పాల్గొన్నారు.