ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సతీ సమేతంగా విచ్చేసిన జస్టిస్ రామ సుబ్రహ్మణియన్‌కు ఆలయ ఈవో శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జస్టిస్ రామసుబ్రహ్మణియన్ దంపతులకు ఆలయ ఈవో అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


