విజయవాడలీగల్: బెజవాడ బార్ అసోసియేషన్ 2026–2027 ఎన్నికలకు నామినేషన్లు దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికలు ఈ నెల 31వ తేదీన జరగనున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సీనియర్ న్యాయవాది విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ముఖ్య ఎన్నికల అధికారి డీపీ రామకృష్ణ ప్రకటించారు. సాంస్కృతిక కార్యదర్శి పదవికి, ఈసీ కేటగిరీలో 30 ఏళ్లు పైబడిన, 20 ఏళ్లు, 10 ఏళ్లు పైబడిన మహిళల కేటగిరీలో ఒక్కో నామినేషన్ మాత్రమే అందడంతో వారు కూడా ఎన్నికై నట్లు ప్రకటించారు. 10 ఏళ్లు పైబడిన కేటగిరీలో 8 మంది సభ్యులను ఎన్నుకోవలసి ఉండగా, ఇరువురు అభ్యర్థులు ఉపసంహరించుకోగా మిగిలిన 8 మంది, పదేళ్ల కేటగిరీలోని పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రామకృష్ణ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి, జాయింటు సెక్రటరీ, లైబ్రేరియన్, ఇతర పదవులకు పోటీచేసే అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోనందున పోటీ అనివార్యమైంది.


