సోషల్‌ మీడియా శక్తిమంతమైన ఆయుధం | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా శక్తిమంతమైన ఆయుధం

Mar 29 2026 6:50 AM | Updated on Mar 29 2026 6:50 AM

సోషల్‌ మీడియా శక్తిమంతమైన ఆయుధం ● గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్‌ సీపీ బలోపేతమే లక్ష్యం ● సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశంలో పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అవినాష్‌

అసెంబ్లీ తీర్మానం పేరిట డ్రామా

● గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్‌ సీపీ బలోపేతమే లక్ష్యం ● సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశంలో పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అవినాష్‌

పెనుగంచిప్రోలు: డిజిటల్‌ యుగంలో సోషల్‌ మీడియా ఒక శక్తిమంతమైన సాధనమని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అన్నారు. స్థానిక మునేరు అవతల స్నేహ గార్డెన్స్‌లో శనివారం పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో మొదటిగా పార్టీ సోషల్‌ మీడియా వర్క్‌ షాప్‌ నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవినాష్‌ మాట్లాడుతూ ఏ వ్యవస్థ అయినా సమర్ధంగా పనిచేయాలంటే అందుకు తగిన కచ్చితమైన, పటిష్టమైన నిర్మాణం ఉండాలన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కన్వీనర్ల నియామకం చేపట్టామన్నారు. కూటమి నాయకులు ప్రతిపక్ష పార్టీ కుటుంబసభ్యులపై కూడా దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండించాలన్నారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడొద్దు...

సోషల్‌ మీడియా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దొడ్డ అంజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీకి సోషల్‌ మీడియా వెన్నెముకగా పనిచేస్తోందన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు అత్యంత దారుణంగా పోస్టులు పెడుతున్నారని, మనం ఆ విధంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదని, మన నాయకుడు చేసిన మంచిని, ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సోషల్‌ మీడియా ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు పడిగపాటి చైతన్య రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్‌, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి సత్యశ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సాయిరాం, నియోజకవర్గ పరిశీలకుడు ఆళ్ల చెల్లారావు, తిరుపతి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, తిరుపతి ఉత్తర మండల అధ్యక్షుడు బృంగి నవీన్‌, పార్టీ బీసీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బత్తుల రామారావు, కన్నమాల శామ్యూల్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపత విజిత, జిల్లా సోషల్‌ మీడియా ఉపాధ్యక్షుడు అంబోజి నవీన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా నవీన్‌ పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం 2028లోపు శాశ్వత రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారని, మళ్లీ దానిని మారుస్తారనే ప్రచారం ఎందుకని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ప్రశ్నించారు. ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం పేరిట డ్రామా ఆడుతున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉందని, రాజధాని పనులను అడ్డుకునే వారు కూడా లేరన్నారు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి అవినీతి చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి బయటపడుతుందనే భయంతోనే అసెంబ్లీ తీర్మానాల పేరిట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు లక్ష్యం రాజధాని నిర్మాణం కాదని, దాని పేరుతో సంపదను తన అనుచరులు, బినామీలకు దోచిపెట్టడమేనని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement