వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రచురించిన ‘దివ్వెల పండుగలో దోపిడీ పర్వం’ కథనంపై వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయం స్పందించింది. ఈ కథనానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్–1, డివిజన్–2, డివిజన్–3 అధికారులను వివరణ ఇవ్వవల్సినదిగా కోరింది. ప్రధానంగా ఒకవైపు ఆదాయం లేక ప్రతి రోజు సమావేశాలను నిర్వహించి అన్నిచోట్ల ఆదాయం పెరగాలని జిల్లాలోని అధికారులపై కమిషనర్ కార్యాలయం ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా డివిజన్–3 పరిధిలో జరుగుతున్న వ్యవహారాలను అధికారులు పట్టించుకోకపోవటంపై కమిషనర్ కార్యాలయం ప్రశ్నించినట్లుగా సమాచారం. గుడివాడలో వచ్చిన ఆరోపణలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, రిటర్న్స్‌లోనూ జరిగిన వ్యాపారాన్ని చూపకపోవటం వంటి అంశాలపై అధికారులు స్పందించకపోవటంపై ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆరోపణలు ఉన్న సర్కిల్స్‌పై ఉన్నతాధికారులు ఎవరు మద్దతుగా ఉన్నారనే విషయాలను తెలుసుకుంటున్నట్లు తెలిసింది.
అమరావతి: దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అమరావతిలోని కోదండ రామాలయంలో వేంచేసియున్న సీతాసమేత కోదండరామస్వామికి శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని తొలుత దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంపై ఉంచి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పరాశరం రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమానుసారం కల్యాణం జరిపించారు.


