పటిష్ట భద్రతలో ఈవీఎం, వీవీ ప్యాట్లు | - | Sakshi
Sakshi News home page

పటిష్ట భద్రతలో ఈవీఎం, వీవీ ప్యాట్లు

Mar 27 2026 9:51 AM | Updated on Mar 27 2026 9:51 AM

పటిష్ట భద్రతలో ఈవీఎం, వీవీ ప్యాట్లు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు(ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం ఆయన విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదామును పరిశీలించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్‌ఓ లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్‌ సీపీ), కాకాని తరుణ్‌, బి. కృష్ణారెడ్డి (బీజేపీ), కాకొల్లు సురేష్‌ (టీడీపీ) తదితరులు ఉన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement