సీతారాముల కల్యాణం చూతము రారండి | - | Sakshi
Sakshi News home page

సీతారాముల కల్యాణం చూతము రారండి

Mar 27 2026 9:51 AM | Updated on Mar 27 2026 9:51 AM

సీతారాముల కల్యాణం చూతము రారండి పేకాట శిబిరంపై దాడి పామర్రు: మొవ్వ మండల పరిధి భట్ల పెనుమర్రు గ్రామంలో అర్ధరాత్రి పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,21,700ను స్వాధీనం చేసుకున్నట్లు కూచిపూడి ఎస్‌ఐ చావా సురేష్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అంతే కాకుండా వారి 11 బైక్‌లు, 15 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దాడిలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పాల్గొన్నారని వివరించారు.

ధర్మవరప్పాడుతండ(జగ్గయ్యపేట): శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణానికి రావాలంటూ ధర్మవరప్పాడుతండ గ్రామస్తులు బుధవారం ఇంటింటికీ శుభలేఖలు అందించారు. గ్రామంలోని జెండా చెట్టు వద్ద గత ఐదేళ్లుగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆరో వార్షికోత్సవం సందర్భంగా కల్యాణానికి రావాలని కోరుతూ గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి శుభలేఖలు అందజేస్తూ ఆహ్వానించారు. మహిళలు కల్యాణ తలంబ్రాల తయారీకి పసుపు దంచి కల్యాణ ఏర్పాట్లను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement