చిలకలపూడి(మచిలీపట్నం): రానున్న వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పశుపోషకులు పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్‌ను గురువారం ఆయన చాంబర్‌లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గటం, ఆహార స్వీకరణ సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలు తలెత్తి మరణించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇందుకోసం పశువులకు ఎప్పటి కప్పుడు చల్లటి తాగునీరు అందించాలన్నారు. నీడ ఉన్న ప్రదేశాల్లో ఉంచాలన్నారు. పశువుల్లో వేడి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యుని సంప్రదించాలన్నారు. వీటన్నింటిపై గ్రామ పశువైద్యసిబ్బంది యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్, డీఈవో యూవీ సుబ్బారావు ఉన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


