లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని చిట్టినగర్ యూపీహెచ్‌సీని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోజూ ఎంత ఓపీ నమోదు అవుతుంది, అభా ఐడీలు చేస్తున్నారా లేదా, ఆన్‌లైన్ పక్రియ సక్రమంగా జరుగుతుందా అనే అంశాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఫార్మసీలో అత్యవసర మందులు సరఫరా, రోగులకు ఇచ్చిన మందుల వివరాలు, మందుల లభ్యత, వాటిన భద్రపరుచే విధానం వంటి అంశాలను తనిఖీ చేశారు. రోగులకు రక్త పరీక్షల ఎలా నిర్వహిస్తున్నారు.. రిపోర్టులు సక్రమంగా ఇస్తున్నారా అని అక్కడ ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు.


