అవార్డులు బాధ్యతలను పెంచుతాయి | - | Sakshi
Sakshi News home page

అవార్డులు బాధ్యతలను పెంచుతాయి

Mar 27 2026 9:50 AM | Updated on Mar 27 2026 9:50 AM

విజయవాడ కల్చరల్‌: అవార్డులు బాధ్యతలను పెంచుతాయని కామ్రేడ్‌ జీఆర్‌కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు అన్నారు. 2026 సంవత్సరానికి ఉగాది పురస్కారాలు అందకున్న చిత్రకారులకు అభినందన సభను బాలోత్సవ భవన్‌లో పోలవరపు సాహితీ సమితి, డ్రీమ్‌ వర్క్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యాన నిర్వహించారు. గోళ్ల నారాయణరావు చిత్రకారులను అభినందించారు. మాజీ పార్లమెంట్‌ సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ చిత్రకళలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. చిత్రకారులు ఎన్‌ఎస్‌ వెంకట్రావు, వజ్రగిరి, కళాసాగర్‌, పి.రమేష్‌, పట్నాల సుధాకర్‌ను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో మోతుకూరి ఆంజనేయులు, డాక్టర్‌ సీహెచ్‌ రామచందర్‌, కె. సుధాకర్‌, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు ఉపేంద్ర, ఆంజనేయులు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వాడపల్లికి చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన కొప్పుల దుర్గా దివ్య కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ఆధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement