మద్యం అక్రమ కేసులో రిమాండ్‌ పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

మద్యం అక్రమ కేసులో రిమాండ్‌ పొడిగింపు

Mar 26 2026 11:42 AM | Updated on Mar 26 2026 11:42 AM

మద్యం అక్రమ కేసులో రిమాండ్‌ పొడిగింపు రబీ ధాన్యం కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి

విజయవాడలీగల్‌: మద్యం అక్రమ కేసులో రిమాండ్‌ ముగిసిన ప్రతిసారీ సిట్‌ అధికారులు ఏ సెక్షన్ల ప్రకారం రిమాండ్‌ పొడిగింపు కోరుతున్నారో సంబంధిత రిపోర్టులో పేర్కొనకపోవడంపై న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మద్యం అక్రమ కేసులో నిందితుల రిమాండ్‌ బుధవారం ముగియడంతో రిమాండ్‌లో ఉన్న రాజ్‌ కేసిరెడ్డి, రోణక్‌కుమార్‌ను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి, చెరుకూరి వెంకటేష్‌నాయుడు, యద్దల నవీన్‌కృష్ణ గైర్హాజరు పిటీషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌పై ఉన్న మిగిలిన నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముప్పిడి అవినాష్‌రెడ్డి, పైలా దిలీప్‌, అనిల్‌ చోక్రా, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి భాస్కరరావు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులకు వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు.

పోలీసు కస్టడీకి వాసుదేవరెడ్డి, ప్రణోయ్‌ప్రకాష్‌

మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ప్రణోయ్‌ ప్రకాష్‌ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం వారిద్దరికి తొలుత ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్‌ కార్యాలయానికి తరలించి విచారించారు.

తిరువూరు: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలకియా సూచించారు. తిరువూరు వాహినీ కాలేజీలో రబీ ధాన్యం కొనుగోలుపై కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ, సహకార, సచివాలయ, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి బుధవారం శిక్షణ తరగతి నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాల్లో నిర్ణీత ప్రమాణాల ననుసరించి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారిణి వాణి, తిరువూరు ఆర్డీఓ కుమార్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement