వ్యాధుల పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధుల పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలి

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

మచిలీపట్నంఅర్బన్‌: నైపుణ్యాలు పెంచుకుని వ్యాధుల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటిగ్రేటెడ్‌ డిసీజెస్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐహెచ్‌ఐపీ ఫీల్డ్‌ సర్వైలెన్స్‌పై గ్రామ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సంద ర్భంగా డాక్టర్‌ యుగంధర్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వ్యాధుల సమాచార సేకరణ, సమ యానికి నివేదికల సమర్పణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. సకాలంలో కచ్చితమైన సమాచారం అందితే వ్యాధుల నియంత్రణ చర్యలను వేగంగా చేపట్టొచ్చని సూచించారు. గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయకృష్ణ, జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డాక్టర్‌ సాయి కిరణ్‌ శిక్షణ అందించారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కలిగే అనారోగ్య సమస్యలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై వివరించారు.

కృష్ణా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement