నున్నలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నున్నలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

నున్నలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం 2,800 మంది విద్యార్థులకు మలబార్‌ ఉపకార వేతనాలు

విజయవాడరూరల్‌: ఆసియాలోనే పెద్ద మామిడి మార్కెట్‌గా గుర్తింపు పొందిన నున్నలో బుధవారం మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్‌), చెరుకు రసం కాయలు ఆరు టన్నులను నున్నకు చెందిన వెంకటరెడ్డి, ఆగిరిపల్లికి చెందిన సుమంత్‌, ఈదరకు చెందిన నారాయణ తీసుకొచ్చారు. రత్నావత్‌ కిషోర్‌ నాయక్‌ మామిడి కాయలను కొనుగోలు చేశారు. బంగినపల్లి మామిడికాయ రకం టన్ను ధర రూ.1.25 లక్షలు పలికిందని రైతులు తెలిపారు. ఈ సీజన్‌లో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి దాదాపు మూడు నెలలు వ్యాపారం కొనసాగుతుంది. మామిడి కాయల వ్యాపారం ప్రారంభోత్సవానికి పలువురు వ్యాపారులతో పాటు మ్యాంగో గ్రోయర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని 2,800 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌ స్కాలర్‌షిప్స్‌ అందజేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఈ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మలబార్‌ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రిటైర్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ సిరాజ్‌ పీకే మాట్లాడుతూ.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు విలువైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2,800 మందికి రూ.2.52 కోట్లను స్కాలర్‌షిప్‌ రూపంలో అందజేశామని వివరించారు. ఈ కార్యక్ర మంలో సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.పద్మజ, మలబార్‌ హైదరాబాద్‌ షరీజ్‌ కే, జోనల్‌ హెడ్‌ సెంట్రల్‌ ఆంధ్రా, రాయలసీమ నిశిల్‌ చంద్రన్‌, డెప్యూటీ హెడ్‌ అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement