వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం అమ్మ వారికి తామర, గన్నేరు, సన్నజాజులు, ఎర్ర మందారాలు, మరువంతో విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక నుంచి అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణతో పాటు పూజలో పాల్గొనే ఉభయదాతలు, భక్తులు అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం నూతన పూజా మండపంలోఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులు పుష్పా గంపలను అందించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పుష్పార్చన కనుల పండువగా జరి గింది. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్‌ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement