వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సమాజ హితం కోసం కృషి చేస్తున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్‌నాయుడుది ఉన్నతమైన వ్యక్తిత్వం అని సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ కొనియాడారు.
విశాలాంధ్ర పబ్లికేషన్స్ మేనేజర్, విజయవాడ బుక్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్‌నాయుడుకు కళారత్న అవార్డు ప్రభుత్వం నుంచి అందుకున్న సందర్భంగా బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలో ఆయనకు అభినందన సభను నిర్వహించారు. సాహిత్య అకాడమీ ప్రముఖుడు ఎమెస్కో విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈసభకు కె. నారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రచన ప్రపంచం చాలా ప్రాముఖ్యమైందని, అందరితో మమేకమయ్యే దృక్పథంతో పనిచేస్తే సత్ఫలితాలు దక్కుతాయని చెప్పారు.
మనోహర్‌నాయుడు అందరివాడు..
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ మనోహనాయుడు అందరివాడని ప్రభుత్వం నుంచి అవార్డు ఆయనకు దక్కడం గర్వకారణమన్నారు. అనంతరం మనోహర్‌నాయుడు ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరనాథ్‌రెడ్డి, ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ లక్ష్మయ్య, విజయవాడ బుక్ పెస్టివల్ సభ్యులు వెంకట నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


