దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

Feb 20 2026 6:59 AM | Updated on Feb 20 2026 6:59 AM

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుడివాడకు చెందిన మసిముక్కు జలచంద్రరావు, మల్లీశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులైన సత్యనారాయణ, మాధవి, వెంకట నారాయణ, వెంకటరత్నమ్మ పేరిట రూ.2లక్షల విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందజేశారు. జలచంద్రరావు, మల్లేశ్వరి తమ కుమారుడు సత్యనారాయణ, మాధవిల పేరిట రూ.1,55,599 విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందజేశారు. హైదరాబాద్‌ లింగంపల్లికి చెందిన నారాయణమ్‌, రాజేష్‌, నాగలక్ష్మి ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను దాతలకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement