ఉప్పులూరు బాధితులకు న్యాయం చేయాలి
తోట్లవల్లూరు: ఉప్పులూరు ఘటన అమానుషమని, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలుతోందనటానికి ఇది నిదర్శమని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ అన్నారు. బాధిత కుటుంబా లను అనిల్‌కుమార్ శనివారం సాయంత్రం పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో బాధితులైన గొల్లపల్లి మధు, వల్లూరు సురేష్, వెంకటరత్నం, చింతా పాండు తదితరులు తమపై జరిగిన హింసాత్మక చర్యలను అనిల్‌కుమార్ ముందు ఏకరువు పెట్టారు. తమను తప్పు చేశామని ఒప్పుకోవాలంటూ రైలు పట్టాలపై పడుకోబెట్టడం, లారీ టైరు కింద పడేసి చంపేస్తామంటూ బెదిరించారన్నారు. కారులో ఎక్కించుకుని తెలియని ప్రదేశాలలో తిప్పుతూ నరకయాతన చూపించారన్నారు. ఇంత అరాచకంగా వ్యవహరించిన వారిపై హత్యా యత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కై లే అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు.
కైలే అనిల్‌కుమార్


