నేటి నుంచి కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్లో ఈనెల 12 నుంచి 14 వ వరకు మూడు రోజులు పాటు నాట్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం విశ్రాంత ప్రధాన ఆచార్యులు, కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గురువారం తెలిపారు. నాట్యాచార్యులు చక్రవర్తులు పవన్ కుమార్, నిహారిక చౌదరిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వాగ్గేయకారులు (కేరళ) సంగీత సామ్రాజ్య సంచారిణి అంశం పై శిక్షణ, కూచిపూడి నాట్య చరిత్ర, పరిక్రమణ సిద్ధాంతం పై అవగాహన తరగతులు ఉంటాయని చెప్పారు. డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానితో సంగీతం, తాళాలుపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 50 మంది పైగా విద్యార్థులు హాజరవుతారన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–మంగుళూరు జంక్షన్ (07267) ప్రత్యేక రైలు ఈ నెల 24న బుధవారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, శుక్రవారం ఉదయం 6.55 గంటలకు మంగళూరు జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07268) ఈ నెల 26న శుక్రవారం మంగళూరు జంక్షన్‌లో బయలుదేరి, శనివారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి–మంగళూరు సెంట్రల్ (07269) ఈ నెల 28న ఆదివారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మంగళవారం ఉదయం 6.55 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07270) ఈ నెల 30న మంగళవారం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి, బుధవారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
చైన్నె–విజయవాడ వందేభారత్
నర్సాపూర్ వరకు పొడిగింపు
డాక్టర్ ఏంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20677/20678) రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు స్టేషన్‌లలో మాత్రమే హాల్టింగ్ ఉన్న ఈ రైలుకు ఈ నెల 15 నుంచి జనవరి 11 వరకు నర్సాపూర్ వరకు పొడిగించడంతో అదనంగా గుడివాడ, భీమవరం టౌన్‌లలో హాల్టింగ్ ఇచ్చారు. ఉదయం 5.30 గం.లకు డాక్టర్ ఏంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో బయలుదేరుతుంది. రేణిగుంటకు 7.05 గంటలకు వచ్చి 7.10కి బయలుదేరుతుంది. నెల్లూరుకు 8.39కి వచ్చి 4.40కి బయలుదేరుతుంది. తెనాలికి 11.21కి వచ్చి 11.22కి బయలుదేరుతుంది. విజయవాడకు 11.45కి వచ్చి 11.50కి బయలుదేరుతుంది. గుడివాడకు 12.28కి వచ్చి 12.30కి బయలుదేరుతుంది. భీమవరం 1.15కి వచ్చి 1.17కి బయలుదేరి 2.10కి నర్సాపూర్ చేరుకుంటుంది. నర్సాపూర్‌లో 2.50కి బయలుదేరుతుంది. భీమవరం టౌన్‌కు 3.19కి వచ్చి 3.20కి బయలుదేరుతుంది. గుడివాడకు సాయంత్రం 4.04కి వచ్చి 4.05కి బయలుదేరుతుంది. విజయవాడకు 4.50కి వచ్చి 4.55కి బయలుదేరుతుంది.


