ఉన్నత చదువులకు ఆటంకం | - | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులకు ఆటంకం

Dec 9 2025 6:59 AM | Updated on Dec 9 2025 6:59 AM

ఉన్నత

ఉన్నత చదువులకు ఆటంకం

ఉన్నత చదువులకు ఆటంకం నిత్యాన్నదానానికి విరాళం –8లోu

న్యూస్‌రీల్‌

డిసెంబర్‌ వచ్చినా పూర్తికాని అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్న పీజీ స్పాట్‌ అడ్మిషన్లు డిసెంబర్‌ మొదటి వారంలో పూర్తైన డిగ్రీ ప్రవేశాలు

ఉన్నత విద్యామండలి నిర్ణయాలతో తలనొప్పులు

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విశాఖపట్నంకు చెందిన కె.వరప్రసాద్‌ కుటుంబ సభ్యులు రూ. 1,00,023 విరాళంగా అందజేశారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): చంద్రబాబు సర్కార్‌ విద్యావ్యవస్థలో వెనకడుగేస్తోంది. పాలకుల తీరుతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. సాధారణంగా విద్యా సంవత్సరం జూన్‌లో మొదలై దాదాపుగా ఏప్రిల్‌ మాసంలో పూర్తవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ విధానాలతో వివిధ కోర్సులకు సంబంధించిన విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారిందంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 150 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో చేరతారు.

ఇంకా పూర్తికాని అడ్మిషన్లు

ఎప్పుడూ జూన్‌లో చేపట్టాల్సిన సాధారణ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఆయా విభాగాలు చాలా ఆలస్యంగా చేపడుతున్నాయి. ప్రధానంగా డిగ్రీ కోర్సులకు అక్టోబర్‌లో ప్రారంభించి డిసెంబర్‌ మొదటి వారం వరకూ కొనసాగించారు. దీంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆయా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల మొదటి వారం వరకూ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా కళాశాలలు డిగ్రీలో చేరిన విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో తయారు చేసి ఆయా విభాగాలకు పంపుతున్నారు. ప్రస్తుత నిర్ణయాలతో ఈ విద్యాసంవత్సరంలో రెండు సెమిస్టర్లు పూర్తి చేయడానికి ఆగస్టు లేదా సెప్టెంబర్‌ వరకూ కొనసాగే అవకాశముంది.

ప్రస్తుతం కొనసాగుతున్న పీజీ స్పాట్‌ అడ్మిషన్లు

ప్రస్తుతం పీజీ స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐసెట్‌ ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సుల అడ్మిషన్లు పూర్తి చేసినా ఎంఏ, ఎంఎస్సీ వంటి సాధారణ కోర్సుల స్పాట్‌ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా పీజీ కళాశాలలు స్పాట్‌ అడ్మిషన్లకు సమయత్తమవుతున్నాయి.

అవకాశాలు కోల్పోవచ్చు

విద్యాసంవత్సరం ముగింపు సకాలంలో జరగకపోతే వివిధ ప్రాంతాల్లో ఉన్నత విద్యకు పలు రకాల ఆటంకాలు ఏర్పడతాయని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డిగ్రీ కోర్సులు సకాలం పూర్తి కాకపోతే ఇతర రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల్లో పీజీ కోర్సుల అడ్మిషన్లను కోల్పోయే ప్రమాదముంది. ప్రధానంగా చాలా రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడంతో పాటు జూన్‌, జూలై మాసాల్లో అడ్మిషన్లు నిర్వహిస్తాయి. దీంతో ఆలస్యంగా బయటకు వచ్చే డిగ్రీ విద్యార్థులు అక్కడ పీజీ అడ్మిషన్లు కోల్పోతారు. పీజీ విద్యార్థులు సైతం ఇతర కోర్సుల్లో చేరడానికి ఆ విద్యాసంవత్సరంలో అవకాశాలను కోల్పోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

ఉన్నత విద్యామండలి గందరగోళ నిర్ణయాలు, ఆలస్యంగా నిర్వహించే అడ్మిషన్ల కారణం విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కళాశాలలు ముందుగానే తరగతులు ప్రారంభించడంతో అధికారికంగా అడ్మిషన్లు పూర్తయ్యే సమయంలో చేరే విద్యార్థులకు సరైన తరగతులు, బోధన ఉండవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నత విద్యామండలిలో అనుభవం కలిగిన విద్యావేత్తలు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకోవడంతో ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్‌ అధ్యాపకులు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా, విద్యారంగానికి ఇబ్బందులు లేని నిర్ణయాలు తీసుకోవాలిగానీ విద్యాసంవత్సరాన్ని అస్తవ్యస్తం చేసే విధానాలు తీసుకోవడం సరికాదంటూ పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

విద్యాసంవత్సరంలో కోర్సులు చక్కగా పూర్తి చేయడానికి ఉన్నత విద్యామండలి ప్రణాళికలను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ కోర్సులకు కృష్ణా విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ అనధికారికంగా సాంకేతిక విద్యా కోర్సులకు, సాధారణ డిగ్రీ కోర్సులకు ముడిపెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల నోటిఫికేషన్లు ఇవ్వడం తలనొప్పిగా మారిందని పలువురు విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగా మొత్తం విద్యాసంవత్సరం ప్రభావితమవుతుందంటూ పలువుఉ అధ్యాపకులు సైతం విమర్శిస్తున్నారు.

ఉన్నత చదువులకు ఆటంకం1
1/2

ఉన్నత చదువులకు ఆటంకం

ఉన్నత చదువులకు ఆటంకం2
2/2

ఉన్నత చదువులకు ఆటంకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement