రోలర్ స్కేటింగ్‌లో నలంద విద్యార్థుల సత్తా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకూ విశాఖపట్నంలో జరిగిన 37వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో నలంద విద్యానికేతన్ విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్ మాదల పద్మజ తెలిపారు. తమ విద్యార్థులు 22 స్వర్ణ, 18 రజిత పతకాలు సాధించారని ఆమె తెలిపారు. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో వేమూరి కోవిద్ కృష్ణ, వాటిపల్లి వివేక్‌వర్మ, మట్లి యోక్షిత్‌రెడ్డి, సుర వెంకట గిరిథర్, కార్యంపూడి తేజేష్, ఆత్మకూరి హృదయ్ సిద్విక్, వంజరపు మోహన్ శ్రీమాన్ రిషి, సుంకర యాషన్ శరణ్, చిగురుపాటి శ్రీనాథ్, మద్దినేని గోపాల్ కౌషిక్, వేమూరి కిరణ్‌కుమార్, బంగారు పతకాలు సాధించినట్లు తెలిపారు. జూనియర్స్ బోయ్స్ విభాగంలో వెశ్చ జ్యోతి ప్రకాష్, అల్లూరి వెంకట జీతేష్, యర్రంశెట్టి చరిత్ శ్రీ వెంకట్, మిద్దె అరణ్యేష్, కోసూరు బాంధవ్ వెంకట శివసాయి. చింతల చేతన్ సాయిరెడ్డి, కార్యంపూడి డోలకార్తీక్, మేదరమెట్ల అఖిత్‌చౌదరి, కామినేని శ్రీకార్తీక్, కొరిసపాటి శివ శరణ్‌రెడ్డి, కోడె శశికర్ రజిత పతకాలు సాధించినట్లు తెలిపారు.
22 బంగారు, 18 రజిత పతకాల సాధన


