
అభివృద్ధి పేరుతో విధ్వంసం
●కానూరులో పేదల ఇళ్లు
తొలగిస్తే సహించం
●ప్రత్యామ్నాయం చూపాలని
చక్రవర్తి డిమాండ్
పెనమలూరు:కానూరులో అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే బోడెప్రసాద్ విధ్వంసం సృష్టిస్తున్నాడని, పేదలకు ప్రత్యామ్నయం చూపకుండా ఇళ్లు తొలగిస్తే సహించేదిలేదని వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి తెలిపారు. ఆయన ఆదివారం కానూరులో పేదల సమక్షంలో విలేకర్లతో మాట్లాడారు. కానూరులో దాదాపు 40 మంది పేదలు కాలువ కట్టలపై చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. గతంలో వీరికి ప్రభుత్వం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యామ్నయం చూపితే ఇళ్లు ఖాళీ చేస్తామని నివాసితులు స్పష్టం చేశారన్నారు. దరఖాస్తులు కూడా పెట్టారని పేర్కొన్నారు. అయితే దీని పై బోడెప్రసాద్ స్పందించలేదన్నారు. అధికారులు శనివారం అర్ధరాత్రి పొక్లెయిన్‌లతో వచ్చి ఇళ్లు కూల్చడానికి సిద్ధపడ్డారని తెలిపారు. పేదలతో కలిసి ఆందోళణకు దిగటంతో వెనక్కు తగ్గారన్నారు. నిబంధనల ప్రకారం కానూరు ప్రధాన రహదారి 60 అడుగులు ఉండాల్సి ఉండగా కేవలం 30 అడుగుల్లోనే డ్రెయినేజీలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం చేయటం తగదన్నారు. పేదలకు ప్రత్యామ్నయం చూపితే ఇళ్లు ఖాళీ చేస్తారన్నారు.
దందా చేసేందుకే బైక్‌పై పర్యటనలు....
ఎమ్మెల్యే బోడెప్రసాద్ దందా చేయటానికి బైక్ పై గ్రామాల్లో పర్యటనలు నిర్వహిస్తున్నాడని చక్రవర్తి ఆరోపించారు. గ్రామాలలో బిల్డర్లు, భవన యజమయానులు ఎవరెవరు అదనపు ఫ్లోర్‌లు నిర్మిస్తుంది వివరాలు సేకరిస్తున్నాడని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పి.రాఘవరావు, వేమూరి బాలకృష్ణ, మండూరు కోటేశ్వరరావు, షుక్.అహ్మద్ అష్రప్, మల్లంపల్లి వెంకటేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చులకనగా మాట్లాడారు...
ఎమ్మెల్యే బోడెప్రాద్‌మ పట్ల చులకనగా మాట్లాడారని బాధితులు ఆరోపించారు. బాధితులు విలేకరుతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శనివారం ఒక్కసాకిగా ఇళ్లలోకి రావటంతో భయాందోళన చెందామన్నారు. మురికివాడలో ఎలా ఉంటారని చులకనగా మాట్లాడరని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించినట్లు వాపోయారు.

అభివృద్ధి పేరుతో విధ్వంసం