
ముగిసిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్–2025 పోటీలు ఆదివారంతో ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరై వారిలోని ప్రతిభను ప్రదర్శించారు. మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ఎల్.మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎల్.శాంతి, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ కోచ్ వై.రామమోహన్ హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
విజేతల వివరాలు..
● అండర్–12 గరల్స్ విభాగంలో ఏరోబిక్స్, భీమ్ బ్యాలన్స్, ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్, టేబుల్ వాల్ట్, ట్రంప్‌లైన్ విభాగాల్లో పి.అనన్య మొదటి బహుమతిని గెలుపొందింది.
● అండర్–12 బాయ్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్‌లో ఎల్.శ్రీరామ్, ఏరోబిక్స్‌లో ఎం.హీమేష్ మొదటి స్థానంలో నిలిచారు.
● జూనియర్ గరల్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్, భీమ్ ఎక్స్‌ర్‌సైజ్, టేబుల్ వాల్ట్, ట్రంప్‌లైన్ అంశాల్లో పి.ధనీషా, ఏరోబిక్స్ విభాగంలో కె.జాహ్నవి మొదటి బహుమతిని పొందారు.
● జూనియర్స్ బాయ్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో ఎల్.శ్రీరామ్, టేబుల్ వాల్ట్, హైబార్, రోమన్‌రింగ్స్‌లో ఎన్.మెహత మొదటి స్థానంలో నిలిచారు.
● సీనియర్స్ ఏరోబిక్స్ విభాగంలో ఎస్.ఐశ్వర్య, ట్రంప్‌లైన్ విభాగంలో ఎస్.ప్రజ్ఞ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. విజేతలకు అతిథులు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.