‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు | - | Sakshi
Sakshi News home page

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

Oct 20 2025 9:37 AM | Updated on Oct 20 2025 9:37 AM

‘ఆ ఒక

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన భవానీపురం(విజయవాడపశ్చిమ): దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం గవర్నర్‌పేట పీఎస్‌ పరిధిలోని బీసెంట్‌ రోడ్‌, భవానీపురం పీఎస్‌ పరిధిలోని పున్నమీఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఇతర శాఖల అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత పరంగా ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాలలో ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాలను నిర్దేశించే విధంగా, వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలను చేశారు. సీపీ రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసెంట్‌ రోడ్‌ ఏరియాలో పర్యటించి వ్యాపారస్తులతో మాట్లాడుతారని తెలిపారు. అనంతరం పున్నమీఘాట్‌లో ఏర్పాటు చేసిన దీపావళి సంబరాల్లో పాల్గొనే కార్యక్రమంలో మంత్రులు, వీవీఐపీలు, ఇతర అధికారులు పాల్గొంటారని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పార్కింగ్‌ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్‌, ఏడీసీపీ జీ రామకృష్ణ, ఏసీపీలు, ఇనస్పెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు ‘పీజీఆర్‌ఎస్‌’ రద్దు ముసురు.. రైతుల గుండెల్లో గుబులు

సాగు చేయలేక లీజుకిచ్చాం

ఐదు ఎకరాలు పాడైపోయింది

ఇలా చేస్తే పరిష్కారం..

వ్యాపారస్తులతో ముఖాముఖీ..

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): దీపావళి పండుగ సందర్భంగా విజయవాడలోని కలెక్టరేట్‌లో 20వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

కంకిపాడు: భారీ వర్షంతో వరి పైర్లు నేలవాలాయి. అల్పపీడన ప్రభావంతో ముసురు కొనసాగుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి నుంచి వర్షం విడవకుండా కురుస్తోంది. ఆదివారం కూడా మోస్తరు వర్షం పడింది. వర్షానికితోడు తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో చిరుపొట్ట దశకు చేరిన వరిపైర్లు నేలవాలాయి. మండలంలోని కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు గ్రామాల్లో చాలా చోట్ల వరి పొలాలు నేలవాలి నీటిలో నానుతున్నాయి. వర్షం విడవకుండా కురుస్తుండటంతో చిరుపొట్ట దశలో, సుంకు దశలో ఉన్న పైర్లకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వీడని ముసురు..

వర్షంతో పాటు ముసురు కొనసాగుతోంది. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొలాల్లో నిలిచిన నీటిని పక్కనే ఉన్న పంట బోదెల్లోకి మళ్లించుకుని వరి కంకులు నీటిలో నానకుండా రైతులు జాగ్రత్త వహిస్తున్నారు. కంకి, చిరుపొట్ట దశలో వర్షంతో నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు.

జి.కొండూరు: సాగు నీరందించేందుకు తవ్విన కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులకు అడ్డంగా కాలువ తవ్వి, వాగులలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో రైతుల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ముంపు బారిన పడి రైతులు నష్టపోతుంటే ప్రభుత్వాలు, స్థానిక పాలకులు చూసీ చూడనట్లు వదిలేయడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా, జి.కొండూరు, విజయవాడ రూరల్‌ మండలాల పరిధిలోని కవులూరు, కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో తారకరామా ఎడమ కాలువకు ఆనుకొని ఉన్న రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

సమస్యే ఇది..

ఇబ్రహీంపట్నంలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో వినియోగించిన నీటిని తిరిగి కృష్ణా నది లోకి వెళ్లకుండా బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ ద్వారా ఈలప్రోలు గ్రామం వద్ద కుడి, ఎడమ కాలువకు మళ్లించి తారకరామా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరందించడం లక్ష్యంగా 1982లో ప్రణాళిక రచించారు. కృష్ణాజిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడరూరల్‌, మైలవరం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, మండలాల పరిధిలోని 64 గ్రామాలకు చెందిన 56వేల ఎకరాలకు సాగునీరందించే విధంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో కుడికాలువ పొడవు 25.74కిలోమీటర్లు, ఎడమకాలువ పొడవు 51.27కిలోమీటర్లుగా నిర్ధారించారు. మొదటి దశ నిర్మాణంలో భాగంగా రూ.24.97కోట్ల అంచనాలతో.. కుడి కాలువు 6.250కిలోమీటర్ల తవ్వి రెండు పంపుహౌస్‌లు, ఎడమ కాలువ 8.079కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా కొత్తూరు తాడేపల్లి శివారులో 6.6కిలో మీటర్ల వరకు తవ్వి ఆపేశారు. ఈ మొదటి దశ పనులు 2004నాటికి పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకంలో కుడి కాలువ తవ్వకం, పంపుహౌస్‌ల నిర్మాణం కోసం రెండు దశల్లో పనులు జరిగినప్పటికీ ఎడమ కాలువ తవ్వకాన్ని మాత్రం చేపట్టలేదు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.

వాగులకు అడ్డంగా ఎడమ కాల్వ

జి.కొండూరు మండల పరిధిలోని కవులూరు, విజయవాడ రూరల్‌ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామాలకు ఎగువ నుంచి వచ్చే నల్లవాగు(బుడమేరువాగు), చిల్లవాగు, తాడేపల్లివాగు, తొమ్మండ్రంవాగుల ప్రవాహానికి అడ్డంగా తారకరామా ఎడమ కాలువను తవ్వారు. అయితే ఈ కాలువను ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తే వాగులలో వరద ప్రవాహం తారకరామా ఎడమ కాలువలో కలిసి ముందుకు సాగే వీలుండేది. అలా కాకుండా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేయడంతో పాటు, ఎగువ నుంచి వచ్చే వాగులలో వరద దిగువకు పోయేందుకు అడ్డంగా ఉన్న కాలువకు సైపన్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ఎడమ కాలువకు ఎగువన ఉన్న వరిపొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన 400ఎకరాల భూమిని సాగు చేసే రైతులు తారకరామా ఎడమ కాలువ తవ్విన నాటి నుంచి అంటే దాదాపు 20ఏళ్లుగా నష్టపోతున్నారు. వరద నీరు పోయే మార్గం లేక నోటికాడకు వచ్చిన పైరు కుళ్లిపోవడం వంటి ఘటనలతో ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

తారకరామా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేసిన వైనం

అది కూడా వాగుల ప్రవాహానికి అడ్డంగా తవ్వకం

సైపన్‌లు సైతం ఏర్పాటు

చేయకపోవడంతో ఇబ్బందులు

వరద సమయంలో ముంపు

బారిన పడుతున్న వరి పొలాలు

కవులూరు, కొత్తూరు తాడేపల్లికి

చెందిన రైతులకు తీవ్ర నష్టం

ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి కొద్దిపాటి శ్రద్ధ చూపితే తమకు ముంపు కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులు కోరుతున్నారు.

కొత్తూరు తాడేపల్లి గ్రామ శివారులో 6.6కిలోమీటరు వద్ద ఆపేసిన తారకరామా ఎడమ కాలువను ఒక కిలోమీటరు పొడగించి.. ఆ గ్రామ తుమ్మల చెరువులో కలిపితే, కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగి, ఎగువ నుంచి వచ్చే వరద తారకరామా ఎడమ కాలువ ద్వారా దిగువకు పోయే అవకాశం ఉంది.

లేదంటే ఎగువ నుంచి వచ్చే వాగుల వరద పోయేందుకు తారకరామా ఎడమ కాలువకు కిందగా సైపన్‌లు ఏర్పాటు చేసినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

తారకరామా ఎడమ కాలువలో తూడు కాడ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది.

తారకరామా ఎడమ కాలువను కొంత తవ్వి అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఎగువ వాగుల ద్వారా వచ్చే వరద దిగువకు పోయేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో పొలాలు మునిగిపోతున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇదే సమస్యతో తీవ్ర నష్టాలు వస్తుండడంతో నాకు ఉన్న తొమ్మిది ఎకరాలను ఇటుక బట్టీల ఏర్పాటుకు లీజుకిచ్చాను.

– చెరుకూరి శ్రీనివాసరావు,

రైతు, కవులూరు గ్రామం

మా గ్రామ శివారులో నేను ఏడు ఎకరాలు కౌలుకి తీసుకొని వరి సాగు చేశాను. తారకరామా ఎడమ కాల్వ వల్ల వరద దిగువకు పోయే అవకాశం లేక పొలం అంతా మునిగిపోయింది. ఐదు ఎకరాలు ఎందుకూ పనికిరాకుండా పోయింది. పై నుంచి వాగులలో వచ్చే వరద పోయేలా చేస్తేనే పొలాలు సాగు చేయగలుగుతాం.

– తమ్మెట శ్రీహరి,

రైతు, కవులూరు గ్రామం

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు1
1/5

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు2
2/5

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు3
3/5

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు4
4/5

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు5
5/5

‘ఆ ఒక్క కిలోమీటర్‌’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement