
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
మధురానగర్(విజయవాడసెంట్రల్):వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతోనే 60 పీజీ సీట్లు రాష్ట్రానికి లభించాయని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అసలు కట్టనే లేదు అని చెప్పిందనీ.. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం 106 మెడికల్ పీజీ సీట్ల గురించి ఘనంగా ప్రచారం చేసుకుంటుందన్నారు. వాటిలో 60 సీట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన కాలేజీల్లోనే ఉన్నాయన్నారు. ఈ కాలేజీలు మూడు సంవత్సరాల్లోనే 60 పీజీ సీట్లు పొందడం నిజంగా అద్భుతమని చెప్పారు. ప్రజలకు మంచి మెడికల్ విద్య అందించాలని కోరారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించటం ద్వారా మరింత మెరుగైన వైద్యం అందుతుందన్నారు.
పెనమలూరు: ఉరేసుకొని యనమలకుదురులో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన నాగం ప్రభావతి, రాంబాబు, ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. తల్లి నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పని చేస్తుంది. కాగా వారి పెద్ద కుమారుడు రవిప్రకాష్ (19) గంగూరులో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తల్లి, సోదరుడు తిరువూరు ప్రార్థనలకు వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న రవిప్రకాష్ ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణరానికి పాల్పడ్డాడు. రవిప్రకాష్ కోసం స్నేహితుడు సాయిరాం వెళ్లగా ఇంట్లో ఉరేసుకొని కన్పించాడు. వెంటనే ఈ సమాచారాన్ని రవిప్రకాష్ తల్లికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. ఈ ఘటన పై తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరేసుకుని యువకుడి....
కృష్ణలంక(విజయవాడతూర్పు):ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న చెందిన ఘటన చోటుచేసుకుంది. రాణిగారితోట, తమ్మిన పోతురాజు వీధిలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి ఏసుబాబు (20) కూలీ పనులకు వెళ్తుంటాడు. మద్యానికి బానిసవడంతో ఆరోగ్యం క్షీణించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన సోదరి అంజలి కూడా అనారోగ్యంతో ఉంది. తనతో పాటు తన సోదరి కూడా అనారోగ్యానికి గురైందని తరచూ మనస్తాపం చెందుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు తల్లి రూమ్‌లోకి వెళ్లి చూడగా రేకుల షెడ్డు ఐరన్ రాడ్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.