
తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
కంకిపాడు: ఇంటి నుంచి పరారైన చిన్నారులను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. విజయవాడ పటమటలోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఇంట్లో వాళ్ల మీద కోపంతో అలిగి స్కూల్ నుంచి నేరుగా బయటకు వచ్చేశారు. మచిలీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను కంకిపాడు పోలీసుల ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి గుర్తించారు. వారిని విచారించగా ఇంట్లో వాళ్లపై కోపంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి సమాచారం సేకరించి వారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.