
త్వరలో రోయింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణానదిలో వరదలు తగ్గిన తర్వాత త్వరలో రోయింగ్ రాష్ట్ర స్థాయి పోటలు, ట్రయల్స్ నిర్వహించనున్నట్లు శాప్ ఎండీ భరణికి ఖేలో ఇండియా సభ్యుడు, ఏపీ స్కల్లింగ్ –రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని తెలియచేశారు. ఆయన శుక్రవారం శాప్ ఎండీతో సమావేశమై 2025–26 సంవత్సరానికి గాను ఏపీ స్కల్లింగ్– రోయింగ్ అసోసియేషన్ వార్షిక గుర్తింపు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడానికి గిరిజన యువతను రోయింగ్‌కు సిద్ధం చేయవచ్చని తెలిపారు. భారత సైన్యం టాప్ 5 క్రీడల్లో కూడా రోయింగ్‌కు ప్రాధన్యం ఇచ్చిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.