
గాలికొదిలేశారు!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరి పేటలో పరిస్థితులు ఏమీ మారలేదు. నాలుగు రోజుల తర్వాత కూడా రంగు మారిన నీటినే తాగేందుకు సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో డాక్టర్ల నిజ నిర్ధాణ కమిటీ పర్యటించింది. వైఎస్సార్ సీపీకి చెందిన డాక్టర్ మొండితోక జగన్‌న్మోహనరావు, డాక్టర్ సుధీర్ భార్గవ్‌రెడ్డి, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. డయేరియా బాధిత కుటుంబాలు, క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితుల ఆర్తనాదాలు విన్న కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.