
సింగ్‌నగర్‌కు పాకిన ‘డయేరియా’ ఎఫెక్ట్..!
హోటళ్లు మూయించడంపై ఆగ్రహం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాపించి నాలుగు రోజులైన తరువాత శనివారం సాయంత్రం సింగ్‌నగర్‌కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హడావుడిగా బార్‌లు, వైన్ షాపులతో పాటు బిర్యానీ హోటళ్లను సైతం మూయించి వేశారు. ఆయా హోటళ్ల యజమానులు అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యూ ఆర్‌ఆర్‌పేటలో డయేరియా వస్తే సింగ్‌నగర్‌లో హోటళ్లు మూయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము అన్నీ వండుకొని సిద్ధం చేసిన తరువాత హడావుడిగా వచ్చి ఇలా షాపులను మూసేయించారని, ఇప్పుడు వండిన ఆహారం అంతా ఏం చేయాలని, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటర్ నుంచి ఎంబీ స్టేడియంకు వెళ్లే దారిలో 20కి పైగా బిర్యానీ హోటళ్లు ఉన్నాయి. కొందరు హోటళ్ల యజమానులు అధికార పార్టీ నాయకులతో ఫోన్లు చేయించుకొని తాము ప్రభుత్వ నిబంధనలకు అతీతులమన్నట్లుగా యథావిధిగా వ్యాపారాలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకుల మద్దతున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా అంటూ పలువురు వ్యాపారులు ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్‌స్టేషన్ (జీఆర్‌పీ) సిబ్బంది కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రామవరప్పాడు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తల, వంటిపై తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌లో సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరారు.

సింగ్‌నగర్‌కు పాకిన ‘డయేరియా’ ఎఫెక్ట్..!

సింగ్‌నగర్‌కు పాకిన ‘డయేరియా’ ఎఫెక్ట్..!