ముక్కు కారడం సమస్యకు సర్జరీతో విముక్తి
ముక్కు కారడం సమస్యకు సర్జరీతో విముక్తి కారు అమ్ముతానంటూ రూ.11 లక్షలు కొట్టేశారు లబ్బీపేట(విజయవాడతూర్పు): కారు అమ్మకానికి ఉందంటూ ఓఎల్‌ఎక్స్‌లో చూసి కొనేందుకు ప్రయత్నించిన వ్యక్తి నుంచి రూ.11 లక్షలు ఆన్‌లైన్ బదిలీ చేయించుకుని మోసం చేసిన ఘటనపై సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం గొల్లపూడి మసీదు రోడ్డులో నివశించే అనపర్తి శ్రీకాంత్ ప్రీ ఓన్డ్ కార్ల వ్యాపారం చేస్తుంటారు. అతనికి గుర్తు తెలియని వ్యక్తి ఈ నెల 1న ఫోన్ చేసి, తన వద్ద ఇన్నోవా క్రిస్తా కారు అమ్మకానికి ఉందని, ప్రస్తుతం గూడూరులో తన బావమరిది జి.వెంకటేశ్వరరావు స్థలంలో ఉన్నట్లు నమ్మబలికారు. లేటెస్ట్ మోడల్ ఇన్నోవాను అత్యవసరమై అమ్మకానికి పెట్టామని, వెంటనే డబ్బు చెల్లిస్తే ఉంటుందని, లేకుంటే మరొకరికి విక్రయిస్తామంటూ నమ్మబలికారు. దీంతో కారు వద్దకు వెళ్లి ఆ మొత్తాన్ని చెల్లించేందుకు శ్రీకాంత్ సిద్ధపడగా, గుర్తుతెలియని వ్యక్తి ఒక ఎస్‌బీఐ అకౌంట్ నంబరు పంపించి, దానికి ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. దీంతో బాధితులు తన ఐడీఎఫ్‌సీ ఖాతా నుంచి సైబర్ నేరస్తుడు పంపిన నంబరుకు ఆర్టీజీఎస్ ద్వారా ఈ నెల 2న రూ. 11 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెదడు ద్రవం ముక్కు ద్వారా కారడం వంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న 35 ఏళ్ల శేషుకుమారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒబెసిటీ కలిగిన పెరిమోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, ఆ సమయంలో హార్మోన్ లోపం కారణంగా ఎముకలు బలహీనమవుతాయని తెలిపారు. మెదడు పొరలు బలహీనమై, దగ్గు, బలంగా తుమ్మడం, మలబద్దకం వంటి పరిస్థితులు సమస్యను మరింతగా ప్రేరేపిస్తాయన్నారు. శేషుకుమారి పదేళ్లకు పైగా ఈ సమస్యతో బాధపడుతూ 2015లో విజయవాడ జీజీహెచ్‌లో, 2021లో గుంటూరులో ఓపెన్ క్రానియోటమీ సర్జరీలు చేయించుకున్నారని చెప్పారు. సమస్య మళ్లీ పునరావృతం కావడంతో ఆస్పత్రికి రాగా ఈఎన్‌టీ వైద్యులు ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సమస్య నుంచి ఉపశమనం పొందారన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్, డాక్టర్ శాంతిలతను సూపరింటెండెంట్ అభినందించారు.