
సుబ్బారాయుడి సేవలో డెప్యూటీ స్పీకర్
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని శాసనసభ డెప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు పట్టువస్త్రాలతో పాటు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదం అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.