
రైతులను నట్టేట ముంచుతున్నారు
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో కలిసి రైతు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పోసే పరిస్థితులు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో కలిసి దేవినేని అవినాష్ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదిగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు తట్టుకోలేక పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరిస్తే, అవి ఆయనకే తెలియక పోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించిందని, దళారుల నుంచి బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతుల కోసం ఎక్కడికై నా వెళ్లి పోరాడతామని కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ చెప్పిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
యూరియా ఎంత ఉపయోగమో వివరించాం
పంటకు యూరియా ఎంత ఉపయోగమో కలెక్టర్‌కు వివరించామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావడంలేదని తెలియజేశామన్నారు. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెప్పామన్నారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని మాట తప్పారని, ఏ రైతూ ఆనందంగా లేరన్నారు. ఎంత సప్లై చేస్తున్నారు, ఎండ డిమాండ్ ఉందో తెలియజేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి రైతుకూ న్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు. పాలకులు తీరు మార్చకోపోతే రైతుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని కలెక్టర్ చెప్పటం దారుణమన్నారు. ఆయనతో కూడా ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని తెలిపారు. యూరియా దళారుల ద్వారా వెళ్తోందని, దమ్ముంటే చర్యలు తీసుకోండన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అటవీ భూములు, అసైన్ట్ భూములు సాగు చేసిన వారికి కూడా రైతు భరోసా ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
రైతుల తరఫున పోరాడతాం
మొవ్వ: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వారి తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. మొవ్వలో తహసీల్దార్ కార్యాలయానికి కై లే అనిల్ కుమార్, నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి వెళ్లి సోమవారం తహసీల్దార్ మస్తాన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఎరువుల కొరతను, ప్రైవేటు ఎరువుల దుకాణదారులు చేస్తున్న దోపిడీని తహసీల్దార్‌కు వివరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత పెద్ద ఎత్తున ఉన్నా సీఎం, డీసీఎం, మంత్రి లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రిగాని నోరు మెదపక పోవడాన్ని కై లే అనిల్ కుమార్ ఖండించారు. ఎంపీపీ కొండేటి ఇందిర, జెడ్పీటీసీ రాజులపాటి పార్వతి, పార్టీ మండలాధ్యక్షులు రాజులపాటి రాఘవరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మంద శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులను నట్టేట ముంచుతున్నారు