
● హర్‌ఘర్ తిరంగా.. ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మ
దేశభక్తి ఉప్పొంగేలా..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. హర్ ఘర్ తిరంగా 2025 సందర్భంగా ప్రచార పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ లక్ష్మీశ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు పాఠశాల, అన్ని విద్యా సంస్థల్లో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలను అలంకరించడం విద్యార్థులకు తిరంగా రంగోలి, తిరంగా రాఖీ మేకింగ్ వర్క్ షాప్స్ , తిరంగా వేవ్స్ అండ్ థ్రెడ్స్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 9 నుంచి 12వ తేదీ వరకు తిరంగా మహోత్సవ్ పేరుతో ప్రజాప్రతినిధులు, వీఐపీలు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఇందులో డ్వాక్రా మహిళలతో తిరంగా కలర్ థీంతో ప్రత్యేక తిరంగా మేళా నిర్వహిస్తామని తెలిపారు. హర్ ఘర్ తిరంగా సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేసి, ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. తిరంగా బైక్ ర్యాలీలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని భవనాలు, డ్యామ్‌లను అలంకరించి జెండా ఎగరవేయడానికి సిద్ధం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, యువజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.