
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా దోనేపూడి శంకర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్టీఆర్ జిల్లా జిల్లా కార్యదర్శిగా వరుసగా రెండోసారి దోనేపూడి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 1, 2వ తేదీల్లో జగ్గయ్యపేటలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. సోమవారం హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మహాసభ తీర్మానాలు దోనేపూడి శంకర్ మీడి యాకు వెల్లడించారు. ఈ మహాసభలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా బుడ్డి రమేష్, జి.కోటేశ్వరరావు, తూము క్రిష్ణయ్య, చుండూరు వెంకట సుబ్బారావు, లంక దుర్గారావు, జూనేబోయిన శ్రీనివాసరావు, పరుచూరి రాజేంద్రబాబు, వై.యలమందరావు, బుట్టి రాయప్ప, చిలు కూరి వెంకటేశ్వరరావు, పంచదార్ల దుర్గాంబ, షేక్ నాగుల్ మీరా, ఎ.శివాజీ, నక్క వీరభద్రరావు, లంకా గోవిందరాజులు, మేకల డేవిడ్ ఎన్నికయ్యారు. శంకర్ మాట్లాడుతూ మహాసభ 10 తీర్మానాలను ఆమోదించిందన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలని, కట్టలేరుపై వంతెన నిర్మించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.