విద్యకు పేదరికం అడ్డు కాకూడదు | - | Sakshi
Sakshi News home page

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

Jul 21 2025 8:07 AM | Updated on Jul 21 2025 8:09 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రా మోటార్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ (అమ్మ) ఏటా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్‌లో ఉన్న ‘అమ్మ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం అమ్మ హాలులో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథి లక్ష్మీశ విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం పీ–4 విధానాన్ని తీసుకొచ్చిందని, దాదాపుగా 300 బంగారు కుటుంబాలకు ఆంధ్రామోటార్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ (అమ్మ) మార్గదర్శకులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకురావడం అభినందనీయమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, ప్లాస్టిక్‌ వినియోగానికి వ్యతిరేకంగా కూడా అమ్మ ఆధ్వర్యంలో ప్రచారం చేయాలన్నారు.

వృద్ధులకు ఆశ్రయం

అమ్మ అధ్యక్షుడు గారపాటి సతీష్‌బాబు మాట్లాడుతూ ఈ ఏడాది 408 మంది విద్యార్థులకు రూ.16 లక్షలను ఉపకార వేతనాలుగా అందచేస్తున్నామని చెప్పారు. కానూరులో తమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని నిర్మించి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నామని చెప్పారు. సంఘం సభ్యులు జీవీ సుబ్బారావు, దుర్గాప్రసాద్‌, చంద్రశేఖర్‌తో, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

‘హిందూస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌) : హిందుస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఓ హోటల్లో జరిగింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు సింగూరు మోహన్‌రావు, కార్యదర్శి బానా నాగేశ్వరరెడ్డి, చీఫ్‌ కమిషనర్‌ చింటు మురళీనాయుడు, చైర్మన్‌ పుల్లూరు దయాకర్‌, కోశాధికారి బీఎస్‌ చంద్రమౌళీశ్వరరావు, జాయింట్‌ సెక్రటరీ సిడగ రోహిణి, ఉపాధ్యక్షులు పి.మునిశేఖర్‌, నాగవాసవి, నాగశేషమ్మ, పి.వెంకటరమణ, జి.జితేంద్ర, కడప నర్సింహులు, తుంగ శ్రీకాంత్‌, ఆర్గనైజింగ్‌ కమిషనర్‌లు బి.సుజాతరెడ్డి, దుంపల వెంకటప్పలనాయుడులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కమిటీ 2028 వరకు పదవిలో ఉంటుందని అధ్యక్షుడు సింగూరు మోహన్‌రావు తెలిపారు.

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు 
1
1/2

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు 
2
2/2

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement