
భక్తిశ్రద్ధలతో కావడిసేవ
మచిలీపట్నంటౌన్: నగరంలోని కాసానిగూడెంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుబ్బారాయుడి ఆడి ఆషాఢ కృత్తిక మహోత్సవంలో భాగంగా ఆదివారం నగరంలో కావడి సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం కావడి సేవ చేశారు. మూడు స్తంభాల సెంటర్‌లోని విజయగణపతి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ కావడిసేవ వాయిద్యాల నడుమ నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా అన్నాభిషేకం జరిగింది. అనంతరం ఆలయంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞ నంద సరస్వతి శ్రీ బాలస్వామీజీ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులకు అన్న సమారాధన జరిగింది. స్థానిక మేకవానిపాలెంలో వేంచేస్తున్న నాగేంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆడి కృత్తిక కావడి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కావళ్లు ఎత్తారు.