మోపిదేవి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మోపి దేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక (ఆడికృత్తిక)స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం అమ్మవార్లను శాకంబరీదేవిగా అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 7 గంటలకు తీర్థపు బిందె, ధ్వజస్తంభ పూజ, నందీశ్వరపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన అమ్మవార్లను వివిధ రకాల పండ్లు, కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. ఉదయం కలశాభిషేకం, పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్లకు ఏకాదశ రుద్రాభి షేకం, శాకంబరీ అలంకారం చేశారు. లక్షబిల్వార్చన, శాంతి కల్యాణం, మహా నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం వారు అన్న ప్రసాదం స్వీకరించారు.
శాకంబరీ అలంకారంలో శ్రీవల్లీ దేవసేన అమ్మవార్లు
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి పండ్లు, కూరగాయలతో అలంకరణ
కనులపండువగా..