
స్కూలు బ్యాగులు.. నాణ్యత నిల్
ఎన్డీయే కూటమి గొప్పగా చెప్పుకుంటున్న విద్యా ర్థులకు అందజేసిన స్కూలు కిట్లలోని బ్యాగులను చూస్తే నాణ్యతా ప్రమాణాలు ఏ పాటివో తేటతెల్లమవుతున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి అందజేశామని పేర్కొంటున్నా బడులు తెరిచి నెల రోజులు కూడా పూర్తికాకుండానే అవి తెగిపోవడం, జిప్పులు ఊడిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు వాటిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, వారు సంబఽంధిత టైలర్ వద్దకు తీసుకువచ్చి బాగు చేయించడం పరిపాటిగా మారింది. బ్యాగు చినుగును, జిప్పులూడిన వాటిని బట్టి రూ.50 నుంచి రూ.150 వరకు చార్జి వసూళ్లు చేస్తున్నారు. ఉచితం మాటున చేతి చమురు వదులుతోందని పెడనలో పలువురు తల్లిదండ్రులు పేర్కొనడం గమనార్హం.
– పెడన