
ఆ చానళ్ల ప్రసారాలు నిలిపివేత
ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ తీర్మానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేబుల్ రేట్లు అధికంగా పెంచి ఆపరేటర్లపై ఒత్తిడి చేస్తున్న బ్రాడ్‌కాస్టర్ల చానళ్లను నిలుపుదల చేయాలని ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు ఏకవాక్య తీర్మానం చేశారు. గురువారం విజయవాడ అలంకార్ ఇన్‌నందు ఎంఎస్‌ఓలు, కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధరలు పెంచిన బ్రాడ్ కాస్టర్ల చానళ్లను నిలుపుదల చేయాలని తీర్మానించినట్లు అనంతరం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్ ఆప్టిక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు కృష్ణమూర్తి, మల్టీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ఏపీసీఓ జేఏసీ అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్ వెల్లడించారు.
వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం..
వారు మాట్లాడుతూ డిజిటల్ కేబుల్ టీవీ ఇండస్ట్రీ లో పే చానెల్స్ బ్రాడ్‌కాస్టర్లు నిరంకుశంగా రేట్లు పెంచేశారన్నారు. ధీని వల్ల ఆపరేటర్లపై ప్రత్యక్షంగా అదనపు భారం పడి వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఒంటి అనారోగ్యకర పోటీ వాతావరణాన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ట్రాయ్’ వారికి అండగా నిలబడటం చాలా చారుణమన్నారు. తాము కింది స్థాయిలో ఉపాధి కోసం కేబుల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నామని, తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఏ చానల్ పైనా నిషేధం విధించకుండా ప్రసారాలు చేయాలన్నారు.