
రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలకు జట్ల ఎం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించాలని పాపులర్ షూ మార్ట్ ఎండీ చుక్కపల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సబ్ జూనియర్ బాక్సింగ్ సెలక్షన్స్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా తరఫున ఎంపికై న జట్టులోని సభ్యులను అభినందించి స్పోర్ట్స్ కిట్‌లను ఆయన అందజేశారు. బాలుర జట్టులో జ్యోతి శివ, జాన్, సందీప్ సాగర్, సూర్య ప్రణవ్, కార్తీక్, చైతన్య, జీవన్ కుమార్, బాలికల జట్టులో కె.కార్తిక, హేమశ్రీ ఎంపికయ్యారు. ఉమ్మడి కృష్ణాజిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరరాఘవులు, కార్యదర్శి కె.వి.చైతన్యకుమార్, కోశాధికారి బి.బాలాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి బి.రాజా రమేష్, అసోసియేషన్ బాక్సింగ్ కోచ్‌లు హేమంత్ రెడ్డి, సాయి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు.