పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సూపర్ స్వచ్ఛత లీగ్‌లో నగరపాలక సంస్థ ఎంపికైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మునిసి పల్ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నట్లు వివరించారు. దీనికి కారణమైన ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇండోర్, నవీ ముంబై, సూరత్ నగరాల జాబితాలో విజయవాడ నగరం కూడా చేరినందుకు సంతోషంగా ఉందని మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విపత్తుల సమయాన నగరంలో పదివేల పారిశుద్ధ్య కార్మికులతో, 200 మందికి పైగా అధికారులతో, 32 మందికి పైగా ఐఏఎస్‌లతో నిర్వహించి ఇబ్బందులు తప్పించామని పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వల్లే సాధ్యం
మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర