
నిబంధనలు లే అవుట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తాడిగడప మునిసిపాలిటీలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు అడ్డు, అదుపు లేకుండాపోయింది. అనధికార లే అవుట్లు, అనుమతిలేని భవనాలు, అదనపు అంతస్తులకు రేటు కట్టి మరీ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ దందా అంతా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతోంది. మునిసిపాలిటీ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టినా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, నియోజకవర్గ ముఖ్యనేత నియమించిన ఏజెంటు అక్కడ వాలి పోయి నిర్మాణదారులతో బేరం కుదుర్చుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో తాడిగడపలో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైన ‘సాక్షి’లో వరుసగా కథనాలు రావడంలో టౌన్ ప్లానింగ్ అధికారిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. దీంతో కొద్దికాలం అక్రమ అంతస్తులకు అడ్డుకట్ట పడింది. ఇటీవల తాడిగడప మునిసిపల్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయ్యేముందు నియోజకవర్గ ముఖ్యనేత, టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో కుమ్మకై ్క అనధికార నిర్మాణాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో అనధికార లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. కొత్తగా వచ్చిన కమిషనర్ ఈ అక్రమ కట్టడాలపై దృష్టి సారించి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది.
● తాడిగడప– పెద్దపులిపాక రోడ్డులో 74/1ఏ, 74/1బీ, 74/1సీ సర్వే నంబర్లలో ఉన్న 3.30 ఎకరాల్లో అనధికార లేఅవుట్ వెలిసింది. ఈ లే అవుట్‌లో ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే పది నుంచి 12 వరకు భవనాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్లాట్‌కు రూ.లక్ష చొప్పున బేరం కుదుర్చుకుని, రూ.6 లక్షలు అడ్వాన్స్‌గా పుచ్చుకు న్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ముఖ్యనేతకు అంతకు ముందే భవన నిర్మాణదారులు కప్పం చెల్లించారని స్థానికులు బహిరంగ పేర్కొంటున్నారు.
● యనమలకుదురు శివాలయం కాలువ కట్ట కింద భవన నిర్మాణాలపై నిషేధం ఉంది. అయినప్పటికీ సర్వే నంబరు 9/4లో 1.65 ఎకరాల్లో లేఅవుట్ వేసి అనధికారికంగా భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంతంలో 15కు పైగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల వెనుక నియోజకవర్గ ముఖ్యనేత హస్తంతోపాటు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి, భవన యజమానులకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
● యనమలకుదురు మెయిన్ రోడ్డు వద్ద ఉన్న గ్రామ కంఠంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఇరుకు రోడ్డులో ఎలాంటి అనుమ తులు తీసుకోకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనం వైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. యనమలకుదురు డొంకరోడ్డు, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెంట్ హౌస్ నిర్మాణాలకు సైతం ఒక్కొదానికి రూ.5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.
అనధికార లేఅవుట్లలో విద్యుత్ లైన్లు
తాడిగడప– పెద్దపులిపాక రోడ్డులో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే రూ.5 లక్షలు తీసుకొని విద్యుత్ శాఖ అధికారి ఒకరు అక్రమ లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ ముఖ్యనేత అండదండలు ఆ అధికారికి ఉండటంతో ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు చేస్తూ రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆ అధికారి ముడుసేల వసూళ్లలో ‘నవ’ శకానికి నాంది పలికారు.
కొత్త కమిషనర్ దృష్టిసారించాల్సిందే..
తాడిగడప మునిసిపాలిటీలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలపై కొత్తగా వచ్చిన మునిసిపల్ కమిషనర్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమాలపై కొరడా ఝళిపించడంతోపాటు, అందుకు బాధ్యులైన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాడిగడప మునిసిపాలిటీలో విచ్చల విడిగా అక్రమ లేఅవుట్లు ఆ లేఅవుట్లలో అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు అనధికార లే అవుట్లలో ముడుపులు తీసుకొని విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్న వైనం పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత, టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారం
విద్యుత్ హైటెన్షన్ వైర్ల సమీపంలో..
విద్యుత్ టవర్ లైనుకు పది మీటర్ల వరకు 119 జీవో ప్రకారం ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదు. టవర్ లైన్ కింద గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయాలి. అందుకు భిన్నంగా యనమలకుదురు కొండ వెనుక టవర్ లైన్ కిందనే అక్రమ నిర్మా ణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు చేతులు తడిపారు. మూడంతస్తు లకు అనుమతి తీసుకుని ఐదంతస్తుల భవనం నిర్మి స్తున్నారు. 40 ఫ్లాట్లు టవర్ లైన్ కింద నిర్మిస్తుండటం విశేషం. ఇటీవల భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వది లాడు. స్థానికులు ఫిర్యాదు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు తుతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించి 14 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, ఒక్క పైసా జమచేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలు లే అవుట్

నిబంధనలు లే అవుట్