
కార్తికేయుడికి వెండి బిస్కెట్ల సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన తాళం నితిన్ కుమార్ కుటుంబ సభ్యులు 2.3 కిలోల వెండి బిస్కెట్లను శనివారం సమర్పించారు. ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం వెండి బిస్కెట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ, వెంకటేశ్వరావు, కిషోర్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నేరాల నివారణకు
పటిష్ట చర్యలు చేపట్టాలి
పెనమలూరు: నేరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి.వి.జి.అశోక్‌కుమార్ ఆదేశించారు. కానూరు అన్నే కల్యాణ మండపంలో కృష్ణా జిల్లా ఇయర్లీ క్రైమ్ మీటింగ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. వాటి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మదక ద్రవ్యాల నివారణ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. రానున్నకాలంలో క్రైమ్ రేట్ తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. తొలుత ఐజీ అశోక్‌కుమార్‌కు డీఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, సబ్ డివిజన్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ ఈఏపీసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఏపీ ఈఏపీసెట్–2025(ఎంపీసీ స్ట్రీమ్) పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌అండ్ గేమ్స్ కేటగిరికి చెందిన 570 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శని వారం పూర్తి చేశామని హెల్త్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
నేటి షెడ్యూల్ ఇదే..
ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విద్యార్థుల 60,001 నుంచి లక్ష లోపు ర్యాంకు పొందిన విద్యార్థులు, సీఏపీ–1 నుంచి 50 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు.
తిరుపతమ్మకు సారె సమర్పణ
పెనుగంచిప్రోలు(వత్సవాయి): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారికి సారెను సమర్పించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించారు. సారె సమర్పించిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈవో కిషోర్‌కుమార్, ట్రస్టు బోర్టు సభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సూపరిండింటెంట్ డి.వి.ఎస్.రాజు పాల్గొన్నారు.

కార్తికేయుడికి వెండి బిస్కెట్ల సమర్పణ

కార్తికేయుడికి వెండి బిస్కెట్ల సమర్పణ

కార్తికేయుడికి వెండి బిస్కెట్ల సమర్పణ